హైదరాబాద్: 28°C
వార్తలు

భూకబ్జా ఆరోపణలపై స్పందించిన కాకాణి

AP: భూకబ్జా ఆరోపణలపై మాజీమంత్రి కాకాణి గోవార్ధన్ స్పందించారు. 2016లో సోమిరెడ్డి అండ్ కో రూ.15 లక్షల విలువైన భూములను రూ.6 లక్షలకు కాజేసే ప్రయత్నం చేసిందని అన్నారు. 'పొలం ఇవ్వలేదని రైతు కోటేశ్వరరావు పేరు రికార్డుల నుంచి తొలగించారు. అప్పట్లో బాధితులు న్ను కలిసి న్యాయం చేయమని అడిగారు. రైతులకు రూ.15 లక్షల పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చాను' అని కాకాణి స్పష్టం చేశారు.