హైదరాబాద్: 28°C
వార్తలు

విషవాయువు పీల్చి నలుగురు మృతి

బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. గయాజీ పరిధిలో బావిలో పేరుకుపోయన వ్యర్థాలను శుభ్రం చేయడానికి లోపలికి దిగిన సమయంలో అందులో పేరుకుపోయిన ప్రమాదకర విషవాయువులను పీల్చడంతో ఊపిరాడక నలుగురు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.