హైదరాబాద్: 28°C
వార్తలు

'దేశం గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలి'

BPT: బల్లికురవ (మం) గుంటుపల్లి స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌డీవో ఉమాదేవి, ఎంపీడీవో కుసుమకుమారి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు దేశం గర్వించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అంతకుముందు రికార్డులను తనిఖీ చేసి, కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.