హైదరాబాద్: 28°C
వార్తలు

వికసిత్ భారత్ కోసం పని చేయాలి: ముర్ము

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. వికసిత్ భారత్ కోసం అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని ప్రతిఒక్కరూ గౌరవించాలన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని కోరారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి బడుగుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని.. స్త్రీ విద్య, మహిళా సాధికారత కోసం పాటుపడ్డారని తెలిపారు.