హైదరాబాద్: 28°C
వార్తలు

'పాఠశాలల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి'

BHNG: గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి ప్రజలు, యువత ముందుకు రావాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. జలాల్‌పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాత గుండ్ల సుధాకర్ సహకారంతో విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు విజ్ఞానాన్ని అందించే కేంద్రాలని, వాటిలో మౌలిక వసతుల కల్పనకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.