హైదరాబాద్: 28°C
వార్తలు

స్వాతంత్య్ర వేడుకలు.. ట్రాఫిక్ ఆంక్షలు

HYD: గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉ. 6 నుంచి మ. 12 గంటల వరకు గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రామదేవ్‌గూడ నుంచి గోల్కొండ వైపు సాధారణ వాహనాలకు రాకపోకలు నిలిపివేయనున్నారు. పాస్‌ల ఆధారంగా ప్రత్యేక పార్కింగ్, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.