హైదరాబాద్: 28°C
వార్తలు

అర్హులందరికీ 'నేతన్న నేస్తం' అందిస్తాం: మంత్రి

KRNL: అర్హులైన నేతన్నలందరికీ 'నేతన్నల సేవలో' పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని శుక్రవారం మంత్రి సవిత వెల్లడించారు. ఇప్పటికే పలువురు నేతన్నల బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల చొప్పున నగదు జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన అర్హులైన వారందరికీ ఒకట్రెండు రోజుల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. నేతన్నల కుటుంబాల్లో నిజమైన ఆనందం చూడాలన్నదే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు.