హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాజ్‌నాథ్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహల్ తీరు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పని విమర్శించారు. గాంధీ అనే ఇంటి పేరు ఉన్న వ్యక్తి ఇంతటి సిగ్గు చేటు వ్యాఖ్యలు చేయడం ఊహకు కూడా అందటం లేదన్నారు. ప్రధానిని ఉద్దేశించి అలాంటి భాషను వాడే కాంగ్రెస్ పార్టీకి పటేల్, నెహ్రూ వారసత్వం అని చెప్పుకునే నైతిక హక్కు ఉందా అని నిలదీశారు.