హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ మండిపాటు

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వ్యాఖ్యల రగడ కొనసాగుతోంది. మోదీ విదేశాంగ విధానంపై తాజాగా రాహుల్ సెటైర్లు వేశారు. మహిళలను కించపర్చే విధంగా రాహుల్ ప్రవర్తించారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. విపక్షనేతగా రాహుల్ పనికిరారని పేర్కొన్నారు. గతంలో సోనియా, మన్మోహన్ ఇలా ప్రవర్తించలేదని వెల్లడించారు. మోదీ ప్రధాని అయ్యాక భారత్ ప్రతిష్ఠ పెరిగిందన్నారు.