హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు ముందే ఆయన భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరు దేశాల అధికారులు తేదీలను ఖరారు చేసే పనిలో ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నెల చివరి నాటికి లేదా సెప్టెంబర్ తొలివారంలో రెహమాన్ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది.