ఒడిశా పూరీ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. తాల్చేర్ నుంచి పూరీకి వస్తున్న మెమూ ప్యాసింజర్ రైలు పూరీ ప్లాట్‌ఫారమ్ నంబర్ 3 సమీపంలోకి రాగానే పట్టాలు తప్పడం అందరిని భయాదోళనలకు గురి చేసింది. అయితే ఆ సమయంలో రైలు అత్యంత నెమ్మదిగా కదులుతుండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వార్తలు
పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు


