డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్లేవారికి పంజాబ్ యువకుడు కీలక అభ్యర్థన చేశాడు. డంకీ రూట్‌లో వెళ్లి మెక్సికోలో తను చిక్కుకుపోయినట్లు చెప్పాడు. సురక్షితంగా తీసుకువెళ్తామని నమ్మించిన ఏజెంట్లు చివరకు తనపైనే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అటువంటి ఏజెంట్ల మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశాడు. తను తప్పు చేశానని.. ఎవరూ కూడా ఆ రూట్‌లో అమెరికాకు వెళ్లొద్దని సూచించాడు.
వార్తలు
అమెరికాకు వెళ్లేవారికి పంజాబ్ యువకుడి అభ్యర్థన


