హైదరాబాద్: 28°C
వార్తలు

భవనాల మంజూరుకు ఎమ్మెల్యే హామీ

MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల, ట్రైబల్ హాస్టల్‌కు పక్కా భవనాలు మంజూరు చేయాలని శుక్రవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డికి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణగౌడ్ వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీపై విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.