హైదరాబాద్: 28°C
వార్తలు

పంద్రాగస్టు నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన

KRNL: జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించి, పారిశుద్ధ్యం, తాగునీరు, మొబైల్ మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వై.జంక్షన్, వాసవి నగర్, కొండారెడ్డి బురుజుల వద్ద అన్న క్యాంటీన్‌లను తనిఖీ చేశారు.