ATP: బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్సార్సీ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ విద్యార్థులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సైకిళ్లు పంపిణీ చేశారు. 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులకు ఈ కానుక అందించారు. విద్యార్థులకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వార్తలు
సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం: ఎమ్మెల్యే


