SS: ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన ప్రముఖ తోలుబొమ్మల కళాకారుడు శిందే చిదంబరరావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు అవార్డుతో పాటు మెమెంటో, రూ.లక్ష ప్రోత్సాహకం అందజేశారు. తోలుబొమ్మల ప్రదర్శనలో ప్రతిభ చూపినందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది.
వార్తలు
శిందే చిదంబరరావుకు సంగీత నాటక అకాడమీ అవార్డు


