హైదరాబాద్: 28°C
వార్తలు

దేశ రాజధానిలో బాంబు బెదిరింపులు

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీ హైకోర్టు, విమానాశ్రయం, పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపు వచ్చింది. 'మ.2:11 గంటలకు ఢిల్లీ హైకోర్టును పేల్చేయండి' అని ఇ-మెయిల్ వచ్చింది. ఖలీస్థాన్ పేరుతో పంపిన ఇ-మెయిల్‌లో, ఢిల్లీలోని పలు ప్రదేశాలను పేల్చివేయడానికి సంబంధించిన ప్రణాళికల వివరాలు ఉన్నాయి. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.