GNTR: ఫిరంగిపురానికి చెందిన జర్మనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రామిశెట్టి శిల్ప తన ఊరి కోనేరు శుభ్రతకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. జర్మనీలోని ఐటీ డిజైన్ కంపెనీ సహకారంతో కోనేరులో పెరిగిన పిచ్చిమొక్కలు, జమ్ము తొలగింపు పనులను చేపట్టారు. ఈ పనులను శుక్రవారం శిల్ప తండ్రి జోజప్ప అధికారికంగా ప్రారంభించారు. సొంత ఊరి అభివృద్ధికి చూపుతున్న చొరవపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
VIDEO: కోనేరు అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐ ఆర్థిక సాయం


