HNK: ఐనవోలు మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒంటిమామిడిపల్లి పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి నంది సెంటర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీగా వచ్చి దేశభక్తి నినాదాలు చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సర్పంచ్ ఆడెపు స్రవంతి, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.
వార్తలు
ఘనంగా హర్ ఘర్ తిరంగా విద్యార్థుల ర్యాలీ


