AP: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలమే ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని పేర్కొన్నారు. ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తులను స్మరించుకునే పవిత్ర దినమని, సత్యం, అహింస, శాంతి, సోదరభావాలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. జాతి నిర్మాణానికి అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దామని ఆయన ఆకాంక్షించారు.
వార్తలు
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు


