హైదరాబాద్: 28°C
వార్తలు

వల్లూరు SIగా సూర్యనారాయణరెడ్డి

KDP: వల్లూరు పోలీస్ స్టేషన్ నూతన SIగా సూర్యనారాయణరెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన బి.కోడూరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ప్రజలు తమ సమస్యలను ఎల్లప్పుడూ నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ఆయన సూచించారు.