హైదరాబాద్: 28°C
వార్తలు

ఉండ్రాజవరంలో ఘనంగా తిరంగా ర్యాలీ

EG: ఉండ్రాజవరంలో శుక్రవారం నిర్వహించిన తిరంగా ర్యాలీలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను చేతబూని పాల్గొన్నారు. 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ర్యాలీ మారుమోగగా, దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబించేలా కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ.. 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.