హైదరాబాద్: 28°C
వార్తలు

జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన

దేశంలో 2027 జనాభా లెక్కలకు కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. జనగణనలో మొదటి దశలో అడగాల్సిన 40 ప్రశ్నలను నోటిఫై చేసింది. ఇందులో కులం, షెడ్యూల్డ్ కులాలు(SC), షెడ్యూల్డ్ తెగలు(ST)కు సంబంధించిన వివరాలతో పాటు కోవిడ్-19 వ్యాక్సినేషన్‌పై కూడా సమాచారం సేకరించనున్నారు. ప్రతి వ్యక్తి షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగకు చెందినవారా? వారి కులం ఏమిటి? వంటి వివరాలను నమోదు చేయనున్నారు.