AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణమాస సందడి ప్రారంభమైంది. తొలి శుక్రవారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. వరలక్ష్మీ వ్రతం రోజున వరలక్ష్మీదేవిగా దుర్మమ్మ దర్శనమివ్వనున్నారు. అలాగే ఈనెల 27, 28, 29 తేదీలలో పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరుగనున్నాయి.
వార్తలు
శ్రావణ శుక్రవారం.. ఇంద్రకీలాద్రిపై రద్దీ


