హైదరాబాద్: 28°C
వార్తలు

పాడేరు యువతకు కీలక సూచన

ASR: జిల్లాలోని 15నుంచి 29ఏళ్ల యువత MY Bharat పోర్టల్‌లో నమోదు చేసుకుని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న యువజన కార్యక్రమాలు, శిక్షణ, వాలంటీర్ సేవలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నిశాంతి శుక్రవారం సూచించారు. యువత దేశ నిర్మాణ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు.