SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ బి. శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో వాలీబాల్, క్రికెట్, మ్యూజికల్ చైర్స్ తో పాటు, పలు పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
వార్తలు
VIDEO: క్రీడా పోటీల్లో విద్యార్థుల సందడి


