హైదరాబాద్: 28°C
వార్తలు

ఒక్క ఏడాదిలో 14,488 మంది విద్యార్థుల ఆత్మహత్య

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ఒకే ఏడాదిలో కెరీర్ ఒత్తిడి, మానసిక రుగ్మతలు, ఒంటరితనం, వేధింపులు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 14,488 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) వెల్లడించింది. ఈ గణాంకాలు విద్యా వ్యవస్థలోని ఒత్తిళ్లను, విద్యార్థుల మానసిక పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి.