హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 16న ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: రొంపిచెర్లలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 8గంటల నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని ఎంఈవో శ్రీనివాసులు తెలిపారు. శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. అవసరమైన వారిని ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.