HNK: ఐనవోలు గ్రామంలో పెరుగుతున్న కోతుల బెడదను నివారించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం కోతుల పట్టివేత కార్యక్రమం చేపట్టారు. కోతులు ఇళ్లలోకి చొరబడుతూ ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లడంతో పాటు పంటలు, వస్తువులను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ తెలిపారు. పాలకవర్గ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
వార్తలు
VIDEO: కోతుల బెడదకు చెక్


