హైదరాబాద్: 28°C
వార్తలు

16 నుంచి చర్లపల్లి-కొట్టాయం స్పెషల్‌ రైళ్లు

ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య 6 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ద.మ. రైల్వే ప్రకటించింది. ఈనెల 16 నుంచి 31 వరకు ప్రతి ఆదివారం చర్లపల్లి నుంచి ఉదయం 7:15 గంటలకు, ప్రతి సోమవారం సాయంత్రం 4:45 గంటలకు కొట్టాయం నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుంది, ఈ రైలుకు సెకండ్‌ AC, థర్డ్‌ AC బోగీలతో పాటు స్లీపర్‌, జనరల్‌ క్లాస్‌ బోగీలు కూడా ఉంటాయని CPRO తెలిపారు.