హైదరాబాద్: 28°C
వార్తలు

భవనాలకు ఎప్పుడు మోక్షం..?

VZM: గంట్యాడ మండలం నీలావతి, వసంత గ్రామాల్లో నిర్మాణం చేపట్టిన అంగన్‌వాడీ భవనాలు ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. నరవలో స్లాబు దశ వరకు చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు వదిలేశారు. దీంతో కేంద్రాలను ఇరుకైన అద్దె గదుల్లో నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని PR ఏఈ కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా.. బిల్లుల సమస్య పరిష్కరించి, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.