హైదరాబాద్: 28°C
వార్తలు

బండారులంకలో తీరని తాగునీటి కష్టాలు

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం బండారులంకలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని చివరి ప్రాంతాలకు వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే నీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకాధికారి తహసీల్దార్ వాసా సామ్యూల్ దివాకర్ స్పందించి రోజూ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.