స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు ప్రసంగించనున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రసారం జరుగుతుంది. ముందుగా హిందీ, తర్వాత ఇంగ్లిష్ వెర్షన్‌లో ప్రసారమవుతుంది. ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం ఉంటుంది.
వార్తలు
నేడు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం


