హైదరాబాద్: 28°C
వార్తలు

దేశ రాజధానిలో పటిష్ట బందోబస్తు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ బహుళ అంచెల భద్రత, 1000 సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో పహారా కల్పించారు. అనుమానితులు, నేరగాళ్ల కదలికల దృష్ట్యా భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు. ఎర్రకోటలో కార్యక్రమానికి వీఐపీలు సహా 25 వేల మంది హాజరవుతారని అంచనా. నేరస్తులను గుర్తించేందుకు అభిజ్ఞాన్ యాప్‌ను వాడుతున్నారు.