హైదరాబాద్: 28°C
వార్తలు

కందాల చంటిని అభినందించిన ఎమ్మెల్యే గిడ్డి

కోనసీమ: మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఎంపికైన కందాల చంటిని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం రాత్రి ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే కొనియాడారు. కందాల చంటి నిస్వార్థ సేవలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.