హైదరాబాద్: 28°C
వార్తలు

వాహనాల వేలంతో రూ.93,560 ఆదాయం

MHBD: గూడూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో గురువారం నిర్వహించిన వాహనాల బహిరంగ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.93,560 ఆదాయం సమకూరింది. మహబూబాబాద్ ఎక్సైజ్ అధికారి పి. కరంచంద్ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో వాహనాల విక్రయం ద్వారా రూ.79,700, జీఎస్టీ ద్వారా రూ.13,860 ఆదాయం వచ్చింది. వేలంలో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది పాల్గొన్నారు.