హైదరాబాద్: 28°C
వార్తలు

J&Kలో భారీ వర్షాలు, ఈదురుగాలులు

J&K భదర్వాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, జలధారలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి భారీగా వరద రావడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మసీదు మొహల్లా ప్రాంతంలో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. భదర్వాలోనూ ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి.