హైదరాబాద్: 28°C
వార్తలు

పెళ్లికాని యువత మద్యం తాగితే రూ.5 వేలు ఫైన్

తమిళనాడు నాగపట్టినం జిల్లా వేళాంగణ్ణి సమీపంలోని విళుందమావడి గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. 'మద్యాన్ని అరికడదాం.. ప్రజలను రక్షిద్దాం' అనే కార్యక్రమం చేపట్టింది. పెళ్లికాని యువత మద్యం తాగితే రూ.5 వేల జరిమానా వసూలు చేస్తామని తెలిపింది. పెళ్లైన వారు తాగవచ్చని, అయితే గొడవలకు దిగితే రూ.5 వేలు వసూలు చేస్తామని హెచ్చరించింది. ఈ ప్రయత్నానికి గ్రామస్తులు సహకరించాలని కోరింది.