ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోకి అకస్మాత్తుగా వరద నీరు చేరింది. శిథిలాల కింద వరద నీరు చేరడంతో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. 14 మందికి గాయాలయ్యాయి. 22 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. అందులో 20 మందిని సహాయక బృందాలు వెలికితీశాయి. ఇద్దరు కార్మికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుర్ఘటనపై సీఎం ధామి విచారం వ్యక్తం చేశారు.
వార్తలు
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి


