KKD: మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ప్రత్తిపాడు CI బి.ఎస్. అప్పారావు హెచ్చరించారు. SP బిందు మాధవ్ ఆదేశాలతో ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన 22 మందిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఐదుగురికి జైలు శిక్ష విధించగా, 17 మందికి రూ.1.70 లక్షల జరిమానా విధించిందన్నారు.
వార్తలు
'డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు..ఐదుగురికి జైలు శిక్ష'


