GNTR: కొల్లిపర మండలంలో కోడిగుడ్ల ధరలు దారుణంగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో రూ.220 నుంచి రూ.240 వరకు ఉన్న వంద గుడ్ల ధర ప్రస్తుతం రూ.160కి చేరింది. శ్రావణమాసం వల్ల వినియోగం తగ్గడం, విజయవాడ, కోల్‌కతాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కనీస ఉత్పత్తి వ్యయం కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
వార్తలు
కొల్లిపరలో పడిపోయిన కోడిగుడ్ల ధరలు


