హైదరాబాద్: 28°C
వార్తలు

18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు

PPM: 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు సూచించారు. ఫారం-6 ద్వారా ఎప్పుడైనా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారన్నారు.