హైదరాబాద్: 28°C
వార్తలు

కల్లుమడిలో రూ.28 లక్షలతో అభివృద్ధి పనులు

ATP: శింగనమల మండలం కల్లుమడిలో నిర్వహించిన కార్యక్రమంలో MLA బండారు శ్రావణి పాల్గొన్నారు. ఊరిలో రూ.18 లక్షలతో సీసీ డ్రైన్లు, రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, విద్యుత్ లైట్ల ఏర్పాటు పనులను ప్రజలకు వివరించారు. స్థానికులు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పర్యటన సందర్భంగా అధికారులను ఆదేశించారు. కూటమి పాలనలో గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.