హైదరాబాద్: 28°C
వార్తలు

దొంగల ముఠా అరెస్ట్.. బైక్‌లు స్వాధీనం

TG: సదాశివపేటలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.లక్షలు విలువ చేసే 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ డి. వెంకటేష్ తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీతం సరిపోక, జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.