హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం'

TG: బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆదివాసీలను వనవాసీలుగా మారుస్తూ వారి హక్కులను విస్మరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మండిపడ్డారు. గూడేలను ఖాళీ చేయించి అదానీకి మైనింగ్ కట్టబెడుతున్నారని ఆరోపించారు. నక్సలైట్ల పేరుతో అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల హక్కుల కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అన్నారు.