హైదరాబాద్: 28°C
వార్తలు

నిమ్స్ న్యూరోసర్జన్‌కు అంతర్జాతీయ గౌరవం

TG: నిమ్స్ న్యూరోసర్జరీ అదనపు ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ ఎర్రగుంట అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా ఇండియా సెంటర్‌లో ‘సైంటిస్ట్-ఇన్-రెసిడెన్స్’గా ఎంపికయ్యారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆగస్టు 9 నుంచి 16 వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా ఆధునిక వైద్యం, ఏఐ వినియోగంపై ఆయన చర్చిస్తున్నారు.