హైదరాబాద్: 28°C
వార్తలు

'కార్పొరేట్ దీటుగా నాణ్యమైన విద్య'

TG: తెల్లాపూర్‌లో రూ.48 కోట్ల అంచనా వ్యయంతో కేజీ నుంచి ఇంటర్ వరకు అత్యాధునిక ప్రభుత్వ పాఠశాలను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ దీటుగా ఉచిత నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమన్నారు. సర్వే నంబర్ 323లోని నిర్మాణ స్థలాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించి, మౌలిక వసతులు, ప్రణాళికపై చర్చించారు.