సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెరువులో జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షమైంది. గ్రామంలోని మూలగుండ్ల సీతారెడ్డి ఇంటి వద్ద నెమలిని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ నెమలిని సురక్షితంగా స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
వార్తలు
కల్మలచెరువులో ప్రత్యక్షమైన జాతీయ పక్షి నెమలి


