హైదరాబాద్: 28°C
వార్తలు

మీరు చేయలేకపోతే.. మేం చేస్తాం: సుప్రీం

కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక చక్కెర, ఉప్పు, కొవ్వుతో ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల ప్యాకెట్ల ముందు భాగంలో ప్రమాదకర హెచ్చరిక లేబుళ్లను ముద్రించడంపై కేంద్ర జాప్యం పట్ల మండిపడింది. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో ప్రభుత్వం పెద్ద కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లకు లొంగిపోతుందని వ్యాఖ్యానించింది. 'మీరు చేయకపోతే మేమే ఆదేశిస్తాం' అంటూ అల్టీమేటం జారీ చేసింది.