VSP: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నట్లు జేసీ గొబ్బిళ్ల విద్యాధరి తెలిపారు. “పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్" లో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలు, స్థానిక , విద్యా, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
వార్తలు
'పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి'


